Tenth Exams: విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.. పేపర్ల లీక్ పై మంత్రి సబితా సీరియస్..

Tenth Exams: విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.. పేపర్ల లీక్ పై మంత్రి సబితా సీరియస్..

Update: 2023-04-04 10:17 GMT

Tenth Exams: విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.. పేపర్ల లీక్ పై మంత్రి సబితా సీరియస్..

Sabitha Indra Reddy: తెలంగాణలో వరుసగా టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారం ఇటు ప్రభుత్వ పెద్దలను...అటు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా టెన్త్ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. పదవ తరగతి పరీక్షల విషయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్ మెంట్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. నాలుగు లక్షల 95 వేల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా పనిచేద్దామని కోరారు. మొదటిసారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నారులను గందరగోళ పరిస్థితులను గురి చేయడానికి ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు సబితా ఇంద్రారెడ్డి.

Tags:    

Similar News