Minister Niranjan Reddy Comments: ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం: మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan Reddy Comments: తెలంగాణలో రైతుల అవసరాలకు తగ్గట్టుగానే యూరియా అందుబాటులో ఉందని, కానీ ప్రతి పక్షాల వారు మాత్రం.. కొరత ఉందంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister Niranjan Reddy Comments: తెలంగాణలో రైతుల అవసరాలకు తగ్గట్టుగానే యూరియా అందుబాటులో ఉందని, కానీ ప్రతి పక్షాల వారు మాత్రం.. కొరత ఉందంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కరోనా విపత్తును దృష్టిలో ఉంచుకునే వ్యవసాయ రంగానికి పలు మినహాయింపులు, వెసులుబాట్లను ప్రకటించారని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కావాల్సిన అన్నిరకాల ఎరువులు కలిపి మొత్తం22.30 లక్షల మెట్రిక్‌టన్నులు కాగా ఇందులో 10.50 లక్షల మెట్రిక్‌న్నులు యూరియా వుంది. ఈ మొత్తం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. దీనిని దశల వారీగా తీసుకు వస్తున్నట్టు చెప్పారు.
కేంద్రం జూలై నెల కోటాను సకాలంలో సరఫరా చేయకపోవడంతో స్వయంగా సీఎం కేసీఆర్ కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రితో మాట్లాడారని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. ఈ నెలకు రావాల్సిన కోటా 2.05 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని వెల్లడించారు. మిగిలిన మొత్తం ఈ నెలాఖరులో ఇస్తామని కేంద్ర మంత్రి తెలిపారని, కరోనా ఇబ్బందులను గుర్తించే సీఎం కేసీఆర్ పలుమార్లు సుదీర్ఘ సమావేశాలు ఏర్పాటుచేసి మార్గనిర్ధేశం చేశారని చెప్పారు. రైతుల ఆత్మ స్థైర్యం దెబ్బ తీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.