2072 వరకు హైదరాబాద్ నగరానికి తాగునీటి ఇబ్బందులుండవు-మంత్రి కేటీఆర్

*సుంకిశాల ఇన్ టెక్ వెల్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన

Update: 2022-05-14 07:26 GMT

2072 వరకు హైదరాబాద్ నగరానికి తాగునీటి ఇబ్బందులుండవు-మంత్రి కేటీఆర్

KTR: న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్ ప‌నుల‌కు కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి 2072 వ‌ర‌కు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందు చూపుతో ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. వ‌రుస‌గా ఏడేండ్లు క‌రువు వ‌చ్చినా తాగునీటికి తిప్ప‌లు లేకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.

హైద‌రాబాద్ చుట్టుతా కూడా వాట‌ర్ పైప్ లైన్‌ల‌ను ఏర్పాటు చేశారు. భ‌విష్య‌త్‌లో హైద‌రాబాద్ న‌గ‌రం 100 కిలోమీట‌ర్ల విస్త‌రించిన తాగునీటికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఔటర్ రింగ్ రోడ్డు వెలుప‌లా, బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేశామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

Tags:    

Similar News