జనగామ మున్సిపాలిటీని మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 13వ వార్డు ధర్మకంచ బస్తీలో పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మరిన్ని స్వచ్ఛ వాహనాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉన్నారు.