ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టండి: మంత్రి కేటీఆర్‌

పారిశుద్ధ్య, రోడ్ల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు.

Update: 2020-06-08 10:21 GMT
Minister KTR (File photo)

పారిశుద్ధ్య, రోడ్ల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్ల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ ఈ రోజు అధికారులతో, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను పూర్తిగా కూల్చివేయాలని తెలిపారు. కార్పొరేషన్ల పరిధిలో ఉన్న శ్శశాన వాటికలు, పార్కులు, జంక్షన్లను, అభివృద్ధి చేయాలని అదికారులకు తెలిపారు.

కార్పొరేషన్ల‌ పరిధిలో ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై ప్రధానంగా దృష్టి సారించాలని అన్నారు. రెండు కార్పొరేషన్ల వాటర్‌, ఎనర్జీ ఆడిటింగ్‌ 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఆధునిక స్లాటర్‌ హౌస్‌ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ పట్టణాల వాటర్‌ మ్యాప్‌ని సిద్ధం చేయాలి. రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. కరోనా కట్టడికి కృషి చేసిన‌ కరీంనగర్‌ జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఈ సమావేశానికి మంత్రులు గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, గణేష్‌ గుప్తా, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News