Minister KTR: రోచే ఫార్మా రెండో డేటా అనలిటిక్స్ సెంటర్ ప్రారంభం
Minister KTR: ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నాయి
Minister KTR: అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ జీవన ప్రమాణాలతో పాటు నైపుణ్యం ఉన్న నిపుణులు కలిగిన ఏకైక నగరం.. హైదరాబాద్ అని.. మంత్రి కేటీఆర్ తెలిపారు. రోచే ఫార్మ రెండో డేటా అనలిటిక్స్ సెంటర్‌కు నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేసి.. అంతర్జాతీయ కంపెనీల సరసన చేరిన రోచె ఫార్మాను అభినందించారు. ఈ డేటా సెంటర్ ద్వారా రోచె ఫార్మా తన లక్ష్యాన్ని చేరుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు.. తమ వ్యాపార విస్తరణకు హైదరాబాద్ ను ఎంచుకోవడానికి ఇక్కడి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు.