KTR: హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి
*హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌దే గెలుపు - కేటీఆర్ *రేవంత్ చిలక జోస్యం చెబుతున్నారు- కేటీఆర్
KTR: హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అన్నారు మంత్రి కేటీఆర్. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టారని డిపాజిట్ తెచ్చుకొని చూపండి చూద్దామన్నారు. ఈటెల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో? రేపు ఏం చేస్తాడు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇక ఈటెల రాజేందర్ బీజేపీని ఓన్ చేసుకున్నారా? బీజేపీ ఈటలను ఓన్ చేసుకుందో తెలియదన్నారాయన.
ఈటెలకు ఓటేస్తే సిలిండర్ ధర తగ్గి్స్తారా? పెట్రోల్, డీజిల్ ధర తగ్గిస్తారా అని ప్రశ్నించారు. వెయ్యి నామినేషన్లు వేయిస్తామన్నవారు ఎక్కడికి వెళ్లారని హుజూరాబాద్‌లో వంద శాతం టీఆర్ఎస్‌దే గెలుపని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఎవరు ఆపినా దళితబంధు ఆగదన్న ఆయన నిన్న కూడా 250 కోట్లు ఇచ్చామన్నారు.