KTR: జీహెచ్ఎంసీ పరిధిలో లింక్‌రోడ్లను అందుబాటులో తెస్తున్నాం

KTR: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సమస్యలు, ప్రయాణదూరం తగ్గించేలా లింకురోడ్లు * సీఆర్ఎంపీ కింద రూ. 1800 కోట్లతో కార్యక్రమాలు

Update: 2021-06-28 09:26 GMT

లింక్ రోడ్లు ప్రారంబించిన మంత్రి కేటీఅర్

KTR: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలు, ప్రయాణం దూరం తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో లింక్‌రోడ్లను ఇవాళ అందుబాటులో తెస్తున్నామన్నారు. కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్నరోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా వంతనెలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నామన్నారు. సీఆర్ఎంపీ కింద 1800 కోట్లతో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మొదటి దశలో 313కోట్ల 65 లక్షలతో లింకు రోడ్లు నిర్మిస్తున్నామని... ఇప్పటికే 16 రోడ్లను పూర్తి చేశామన్నారు.

Tags:    

Similar News