KTR: నార్సింగి వద్ద సైకిల్ ట్రాక్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR: సైక్లింగ్‌‌కు హైదరాబాద్‌ను డెస్టినేషన్ చేస్తాం

Update: 2023-10-02 03:13 GMT

KTR: నార్సింగి వద్ద సైకిల్ ట్రాక్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 

KTR: 2040 కల్లా హైదరాబాద్ నగరాన్ని కార్బన్ ఎమిషన్ ఫ్రీ సిటీ గా మార్చడమే ధ్యేయమని మంత్రి కేటీఆర్ తెలిపారు. నార్సింగి వద్ద ఓ ఆర్ ఆర్ సర్వీస్ రోడ్లపై ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి సోలార్ రూఫ్ సైకిల్ ని ట్రాక్ ని ప్రారంభించారు. కేటీఆర్ సైకిల్ ట్రాక్ లను ఇంకా విస్తరిస్తామని హామీ ఇచ్చారు.

దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా సోలార్‌ రూఫ్ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ హైదరాబాద్‌లో నిర్మితమైంది. గ్రేటర్‌ చుట్టూ 158 కిలోమీటర్ల మేర నిర్మించిన ఔటర్‌ రింగు రోడ్డు లోపలి వైపు సుమారు 23 కిలో మీటర్ల దూరంతో ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చేపట్టింది. ఈ సైకిల్ ట్రాక్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కేటీఆర్. గతంతో పోల్చితే ప్రజలు సుఖజీవనానికి అలవాటు పడుతున్నారని, ఆదాయం పెరిగే కొద్దీ బండ్లు, కార్లు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లోని పెద్ద అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి ఒక ఇంట్లోనే రెండుకార్లు ఉంటున్నాయని తెలిపారు. అలాంటివారికి శారీరక శ్రమ ఏముంటుందని ప్రశ్నించారు.

సైక్లింగ్ ద్వారా ఎంతో వ్యాయామం లభిస్తుందన్నారు. సైక్లింగ్ ట్రాక్‌తో ఎవరికి లాభమని.. ఇక్కడి వారికే ఇది ఉపయోగపడుతుందని కొందరు విమర్శిస్తున్నారన్న కేటీఆర్‌.. ఇది కేవలం ప్రారంభం మాత్రమేననన్నారు. మున్ముందు మరిన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ సైక్లింగ్ రేసులు సైతం ఇక్కడ జరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. సైక్లింగ్ ని ప్రమోట్ చేయడంతో పొల్యూషన్ ని తగ్గించవచ్చన్న ఆయన 2040 కల్లా హైదరాబాద్ ని కార్బన్ ఎమిషన్ ఫ్రీ సిటీగా మార్చడమే తమ ధ్యేయమన్నారు. స్పోర్ట్స్ ను ప్రమోట్ చేసేందుకు స్కేటింగ్ రింగ్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. సైక్లింగ్ ని ప్రమోట్ చేస్తున్న హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

23 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ సైకిల్‌ ట్రాక్‌పై సుమారు 16 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో సోలార్‌ పవర్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా దీన్ని డిజైన్‌ చేసి ఏర్పాటు చేశారు. మరో వైపు ట్రాక్‌ పొడవునా సీసీ కెమెరాలను బిగించారు. ట్రాక్ మధ్యలో ఫుడ్ కోర్టులు, రెస్ట్ రూమ్స్, తాగునీటి సదుపాయాలు, సైకిల్ రిపేర్ దుకాణాలు, సైకిల్‌ రెంటల్‌ స్టోర్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. ట్రాక్‌ పొడవునా రంగురంగుల అందమైన పుష్పాలు కనువిందు చేయనున్నాయి. 

Tags:    

Similar News