KTR: కలుషిత జలాల శుద్ధి నిర్వహణ ప్లాంట్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

KTR: మంత్రి కేటీఆర్‌ వెంట మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్‌ విజయలక్ష్మి

Update: 2023-04-15 08:59 GMT

KTR: కలుషిత జలాల శుద్ధి నిర్వహణ ప్లాంట్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

KTR: జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 58 జీఓ కింద 3613 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి కేటీఆర్ నేడు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాల్లారెడ్డి, శాసన మండలి విప్ శంభీపూర్ రాజు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య గత ప్రభుత్వాల శాపమన్నారు. ఈ డంపింగ్ యార్డ్ 3 వేల మెట్రిక్ టన్నుల చెత్త కు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందన్నారు. జవహర్ నగర్‌కు వచ్చే చెత్త ద్వారా 100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. ప్రస్తుతం 20 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News