వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ.. అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

గొంతు చించుకుని పెద్దగా మాట్లాడితే ఏం ఉండదు -కేటీఆర్‌

Update: 2023-02-04 06:47 GMT

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు.. రెండో రోజు..

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వాడివేడిగా కొనసాగుతోంది. పాతబస్తీకి మెట్రో తెస్తామన్నారు.. ఏమైందని అక్బరుద్దీన్‌ ప్రశ్నించారు. అసెంబ్లీలో హామీలు ఇస్తారని.. కానీ అమలు చేయరని ఆయన అన్నారు. సీఎం, మంత్రులు మమ్మల్ని కలవరని ఆరోపించారు. అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడు బీఏసీ సమావేశానికే రారని కేటీఆర్‌ అన్నారు. బీఏసీకి రాకపోగా... ఏదేదో మాట్లాడితే ఎలా..? అని మంత్రి ప్రశ్నించారు. గొంతు చించుకుని పెద్దగా మాట్లాడితే ఏం లాభం ఉండదని కేటీఆర్‌ అన్నారు.

Tags:    

Similar News