Minister KTR Conducted Review : ఫార్మాసిటీ పనుల ప్రగతిపై సమీక్ష

Minister KTR Conducted Review : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ఐటీ కంపెనీలను, ఎన్నో పరిశ్రమలను స్థాపిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2020-08-24 06:48 GMT

సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్

Minister KTR Conducted Review : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ఐటీ కంపెనీలను, ఎన్నో పరిశ్రమలను స్థాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ ను కూడా స్థాపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో ఫార్మా సిటీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మాసిటీలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకుగాను వారికి శిక్షణ ఇచ్చేందుకు రెండు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఫార్మా క్లస్టర్‌ నిర్మించేందుకు తమ భూమిని ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. స్థానికుల సహకారంతో ఫార్మాసిటీ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశానికి ముందుగా ఫార్మా సిటీ పురోగతిపై అధికారులు మంత్రికి వివరించారు.

ఫార్మాసిటీలో ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణను ఈ కేంద్రాల్లో స్థానికులకు ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు, పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చే చర్యలు తీసుకున్నదని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఫార్మాసిటీ కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఈ దిశగా ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాలని చెప్పారు. ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టనున్న ఫార్మా కంపెనీలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు టాస్క్‌, ఇతర శిక్షణా సంస్థల సహకారం తీసుకోవాలని చెప్పారు.

స్థానికుల ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఫార్మాసిటీలో ప్రభావిత కుటుంబాల జాబితా తయారుచేయాలని ఆదేశించారు. స్థానికులకు శిక్షణ ఇచ్చేందుకు ఫార్మా సిటీ పరిసర మండలాల్లో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ మాణిక్‌రాజ్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఫార్మాసిటీ ఎస్పీవీ సీఈవో శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News