Gangula Kamalakar Escort Vehicle Met With An Accident: మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా..
Gangula Kamalakar Escort Vehicle Met With An Accident: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కాన్వాయ్ కరీంనగర్ జిల్లాలో ప్రమాదానికి గురైంది. కరీంనగర్‌లోని ఆర్టీసీ వర్క్‌షాప్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Gangula Kamalakar Escort Vehicle Met With An Accident: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కాన్వాయ్ కరీంనగర్ జిల్లాలో ప్రమాదానికి గురైంది. కరీంనగర్‌లోని ఆర్టీసీ వర్క్‌షాప్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రి వాహనం వెనక వచ్చే ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోల్తా పడిన వాహనంలో ఉన్న ఎస్సై ఎల్లాగౌడ్ చేతి బొటనవేలు తెగిపోయింది. దీంతో స్థానికులు వైద్యం నిమిత్తం అతన్ని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తివివరాల్లోకెళితే మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మరికొంత మంది మంత్రులు శనివారం కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించిన వారు కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. అంతే కాకుండా పార్టీ స్థానిక నాయకులను, అధికారులను వెంట బెట్టుకుని పలు పనులకు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. నగరంలోని చింతకుంట వద్ద మొక్కజొన్న వ్యవసాయ పరిశోధనా కేంద్రం నూతన భవనాన్ని, బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి మరో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ తీరును మంత్రులు ఎండగట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా అడిగితే కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్రం నుంచి వ్యవసాయ రంగానికి ఎలాంటి సహకారం లభించడం లేదని విమర్శించారు. రైతులకు చేయూతనివ్వడం లేదని కేంద్రంపై మంత్రి నిరంజన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రామడుగు మండలం వెలిచాల గ్రామంలో, తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో రైతువేదిక నిర్మాణానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.