Constable Nagamani: ఎస్‌ఐ వ్యవహారంపై రాచకొండ సీపీ విచారణ జరిపి.. నాకు న్యాయం చేయాలి
Constable Nagamani: కన్నీరు పెట్టుకున్న హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగమణి
Constable Nagamani: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి ఎస్‌ఐ శివకుమార్ సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నాడని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగమణి ఆరోపించారు. తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించానని, కానీ ఎస్‌ఐ శివకుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నాడని ఆరోపించారామె.. తన ఫిర్యాదుపై కనీసం దర్యాప్తు చేయకుండా మాపైనే కేసులు నమోదు చేస్తున్నాడంటూ మహిళా కానిస్టేబుల్ నాగమణి కన్నీరు పెట్టుకున్నారు. ఎస్‌ఐ శివకుమార్ వ్యవహారంపై రాచకొండ సీపీ విచారణ జరిపి.. న్యాయం చేయాలలంటూ మహిళా కానిస్టేబుల్ నాగమణి వేడుకున్నారు.