Medigadda Laxmi Barrage Gates lifted: లక్ష్మీ బ్యారేజీ గేట్లు ఎత్తివేత

Medigadda Laxmi Barrage Gates lifted:రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బ్యారేజీల్లో వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Update: 2020-07-04 14:35 GMT

Medigadda Laxmi Barrage Gates lifted: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బ్యారేజీల్లో వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరింత వరద నీరు పెరిగి ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా ముందు జాగ్రత్తగా కిందకు నీటిని వదులుతున్నారు. మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీ) ఇన్ ఫ్లో పెరుగుతుండటంతో కిందకు నీటిని వదిలేందుకు అధికారులు నిర్ణయించుకున్నారు.

లక్ష్మీ బ్యారేజీ గేట్లు ఎత్తివేత.. దిగువకు 11,500 క్యూసెకుల విడుదల.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని లో లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీ గేట్లను అధికారులు ఎత్తారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద నీరు రావడంతో జలకళ సంతరించుకుంది. బ్యారేజీలో 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లను ఎత్తి 11,500 క్యూసెకుల నీటిని వదులుతున్నారు. బ్యారెజికి ఎగువ నుంచి 12,500 క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రస్తుతం 5.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దిగువన ఉన్న గోదావరి తీర ప్రాంత ప్రజలను, చేపల వేటగాళ్లును వెళ్లవద్దని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ప్రజలకు ఎటువ్నటి ప్రమాదం జరగకుండా చూడాలని ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. జాగ్రత్తగా అనుక్షణం పరిస్థితిని సమీక్షించడానికి అధికారులు అందుబాటులో ఉన్నారు. 

Tags:    

Similar News