Medaram Jatara: ముగిసిన మేడారం మహాజాతర..
Medaram Jatara: కన్నుల పండగగా సాగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసింది.
Medaram Jatara: కన్నుల పండగగా సాగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసింది. గత నెల రోజులుగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నా… ఈనెల 16 నుంచి 19 వరకు మహాజాతర జరిగింది. గిరిజన కుంభమేళాగా పిలిచే మేడారం జాతర సమ్మక-సారలమ్మ తల్లుల వన ప్రవేశంతో ముగిసింది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వనదేవతలను సాగనంపారు పూజారులు. సమ్మక్క గద్దెల వద్ద నుంచి చిలకల గుట్టకు చేరింది. సారలమ్మ కన్నెపెల్లికి చేరింది. పగిడిద్ద రాజు పూనుగొండ్లకు, గోవిందరాజు కొండాయికి వెళ్తారు. దీంతో జాతర అధికారికంగా ముగిసినట్లు అయింది.
ఈ ఏడాది మేడారం జాతరను సుమారు కోటి 50లక్షల మంది భక్తులు సందర్శించుకున్నట్లు అంచనా. తల్లులు గద్దెపైకి చేరడంతో ఎక్కువ మంది భక్తులు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారాన్ని సందర్శించారు.