Nirmal: నిర్మల్ మున్సిపాలిటీలో మాస్టర్‌ప్లాన్ రగడ
Nirmal: నిర్మల్ మున్సిపాలిటీ చుట్టుపక్కల మాస్టర్‌ప్లాన్ వేసేందుకు ప్లాన్
Nirmal: మాస్టర్‌ప్లాన్ రగడ నిర్మల్ మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. నిర్మల్ మున్సిపాలిటీ చుట్టుపక్కల నుండి మాస్టర్‌ప్లాన్ వేసేందుకు అధికారులు ప్లాన్ తయారు చేశారు. అయితే ఈ మాస్టర్‌ప్లాన్‌పై బీజేపీ నేతలతో పాటు భూ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా భూ యజమానులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాస్టర్‌ప్లాన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కామారెడ్డి, జగిత్యాల కంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మాస్టర్‌ప్లాన్‌పై అధికారుల తీరుకు నిరసనగా జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు.