Corona: కరోనా కాలంలో పట్టెడన్నం పెట్టి కడుపు నింపుతున్న దాతలు

Corona: కొవిడ్ బాధితులకు సాయం చేస్తున్న మార్గం ఫౌండేషన్ * హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆహారం పంపిణీ

Update: 2021-05-22 12:10 GMT

మార్గం ఫౌండేషన్ (ఫైల్ ఇమేజ్)

Corona: కరోనాతో తన, మన తేడా లేకుండా దూరం పెడుతున్న ఈ కాలంలో పట్టెడన్నం పెట్టి కడుపు నింపుతున్నారు కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. అలాంటి కోవకు చెందినదే ఈ మార్గం ఫౌండేషన్. విజయవాడలో గల ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా పేషంట్లకు, కోలుకున్నవారికి మూడు పూటల ఫుడ్ సప్లై చేస్తున్నారు. కరోనా ప్యాండమిక్‌లో పలువురి కడుపు నింపేందుకు శ్రీకారం చుట్టిన మార్గం ఫౌండేషన్.

కరోనా సోకి తినడానికి ఇబ్బందులు పడుతున్న వారికి ఫుడ్ అందిస్తూ తమ ఉదారతని చాటుకుంటున్నారు మార్గం ఫౌండేషన్ ప్రతినిధి అన్నపూర్ణ. కొవిడ్ బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారితో పాటు వండుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వారికి ఫుడ్ అందిస్తున్నారు. ఆహారం కావల్సిన వారి కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చే డిటేల్స్‌ ప్రకారం ఫుడ్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే రోజులో 2 వందల మందికి ఫుడ్ ప్యాకేట్స్ అందిస్తున్నారు.

ఇదిలా ఉంటె పూర్తి స్థాయిలో బాధితులకు ఫుడ్ అందించలేకపోతున్నామంటున్నారు ఫౌండేషన్ వాలంటీర్లు. కేవలం ఆరుగురు మాత్రమే ఉండటంతో ఫుడ్ సప్లై చేయడానికి సమయం సరిపోవడం లేదని చెబుతున్నారు.

నగరంలో నలుదిక్కుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని... వస్తున్న అన్ని ఫోన్ కాల్స్‌కు ఆహారం పంపిణీ చేయాలంటే మరికొందరు వాలంటీర్లు కావాలని అంటున్నారు. ఇంతటి విపత్కర సమయంలో బాధితులకు అండగా ఉండేందుకు యువత ముందుకు రావాలని కోరుతున్నారు. అయితే ప్రస్తుతం బాధితుల సంఖ్య పెరగడంతో పంపిణీ పెరిగిందని లాక్‌డౌన్ టైమింగ్స్‌లో తమకు అనుమతినిస్తే మరికొందరికి సహాయం చేయగలమంటున్నారు ఫౌండేషన్ సభ్యులు.

Tags:    

Similar News