మాణిక్యం ఠాగూర్ స్థానంలో మాణిక్‌రావ్ ఠాక్రే నియామకం
T Congress: మొదటి నుంచి ఠాగూర్‌పై అసంతృప్తిగా ఉన్న సీనియర్లు
T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇచ్‌ఛార్జ్‌గా మాణిక్‌రావు ఠాక్రేను AICC నియమించింది. ఇప్పటివరకు తెలంగాణ ఇచ్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్కం ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. తక్షణం ఇది అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కే.సీ. వేణుగోపాల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ఖర్గే కూడా ప్రత్యేక దృష్టిసారించడంతో త్వరలో పీసీసీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నరాని సమాచారం.
తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్ ఎన్నికైనప్పటి నుంచి ఆయనపై పలువురు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. PCC అధ్యక్షుడిగా రేవంత్ నియామకం తర్వాత సీనియర్ నేతలు, ఠాగూర్ మధ్య మరింత గ్యాప్ పెరిగింది. PCC పదవి ఆశించిన కోమటిరెడ్డి వెంట్‌రెడ్డి, ఇటీవల బీజేపీలో చేరిన మర్రి శశిధర్‌రెడ్డి, ఇంకా పలువురు నేతలు ఠాగూర్ వైఖరిని తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి చేతిలో మాణిక్కం ఠాగూర్ కీలుబొమ్మలా మారారని.. ఆయన వల్లే పార్టీలో ఇన్ని సమస్యలని ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలను భరించలేక. ఆయన ఇంచార్జి పదవి నుంచి తప్పుకున్నారని సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే.. మహారాష్ట్రకు చెందిన వారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, ఒకసారి మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేనపై తీవ్రంగా విరుచుకుపడే మాణిక్ రావు ఠాక్రే.. ఇప్పుడు పక్కనే ఉండే తెలంగాణకు కాంగ్రెస్ ఇంచార్జిగా రాబోతున్నారు.