Mancherial woman Dies with Witch Doctor Treatment: భూతవైద్యం పేరిట చిత్రహింసలు.. చివరకు బాలింత మృతి

Mancherial woman Dies with Witch Doctor Treatment: నాలుగు రోజుల క్రితం భూత వైద్యం పేరుతో భూతవైద్యుడు ఓ బాలింతకు నరకం చూపడంతో ఆ మహిళ ప్రాణాల మీదికి వచ్చింది.

Update: 2020-08-04 07:03 GMT
Exorcism In Karimnagar

Mancherial woman Dies with Witch Doctor Treatment: నాలుగు రోజుల క్రితం భూత వైద్యం పేరుతో భూతవైద్యుడు ఓ బాలింతకు నరకం చూపడంతో ఆ మహిళ ప్రాణాల మీదికి వచ్చింది.‌ ఆ భూతవైద్యుడు మహిళ తల వెంట్రుకలు లాగుతూ కొట్టడంతో బాలింత మహిళ అపస్మారక స్థితికి చేరింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతున్న బాలింత ఆరోగ్యం విషమించడంతో సోమవారం అర్ధరాత్రి మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తివివరాల్లోకెళితే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మల్లేశ్ ఏడాది క్రితం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన రజిత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా 4 నెలల క్రితం రజిత ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె అనారోగ్యంగా ఉండటంతో ఆమెకు దయ్యం పట్టిందని కుటుంబ సభ్యులు భూతవైద్యుడిని ఆశ్రయించారు.

ఆ భూత వైద్యున్ని స్వయాన రజిత మేనమామ కుందారంలోని రజిత అత్తవారింటికి తీసుకెళ్లి అక్కడ వైద్యం చేయించారు. ఆ తరువాత భూతవైద్యుడు పచ్చిబాలింత అయిన రజితను కొడుతూ దయ్యం వదిలిందా అంటూ నరకం చూపాడు. ఆ తరువాత మంచంపై పడేయడంతో ఆమె తలకు గాయమైంది. ఆ దెబ్బలు తట్టుకోలేని రజిత చివరికి అపస్మారక స్థితికి చేరుకునే సమయానికి ఏదో చెబుతూ మంచంపై పడేశాడు. ఆ తరువాత కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న రజిత ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి మృతి చెందింది. ఇక బాలింత రజితను విచక్షణారహితంగా కొట్టిన భూతవైద్యుడు శ్యామ్‌తోపాటు, అతడికి సహకరించిన ఆమె బాబాయి రవీందర్‌ను సైతం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి చేశారు. అత్తింటి వారిపై కేసు నమోదు చేసిన జైపూర్ పోలీసులు విచారణ చేపట్టారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా కొంత మంది ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. దీర్ఘకాలంగా అనారోగ్యం పాలయినా, ఇంట్లో ఎదుగుదల లేకపోయినా, అనుకున్న పనులు జరగకపోయినా తమకు ఎవరో ఎదో మంత్రాలు చేస్తున్నారని, లేదా ఏదో దయ్యం పట్టి పీడిస్తుందని నమ్ముతారు. ఇలాంటి నమ్మకాలే ఎంతో మంది దొంగబాబాలను, భూతవైద్యులను సృష్టిస్తున్నాయి. ఆ దొంగ బాబాలు, భూతవైద్యులు తెలిసీ తెలియకుండా చేసే వైద్యంతో కొంత మంది ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు మూఢనమ్మకాలను వదిలేయాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. 

Tags:    

Similar News