'మన ఊరు మన బడి' లో మరో టెండర్ రద్దు
*గ్రీన్ చాక్ బోర్డుల కొనుగోళ్లపై టెండర్లు రద్దు చేసిన ప్రభుత్వం
TS High Court: మనఊరు మన బడి విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ టెండర్లపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతుండగా మరో టెండర్ ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పాఠశాలలో డ్యూయల్ డెస్క్, ఫర్నీచర్ కొనుగోలు టెండర్లను రద్దుచేసిన ప్రభుత్వం తాజాగా బడుల్లో గ్రీన్ చాక్ బోర్డుల కోనుగోళ్లకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. త్వరలో మళ్లీ ఆటెండర్లను పిలవనున్నట్లు హైకోర్టుకు తెలిపింది. ఇక పాఠశాలలో పెయింటింగ్ టెండర్లపై హైకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతోంది.