CoronaVirus: ఉప్పల్‌లో విషాదం..విధి ఆడిన వింత నాటకం.. కుమార్తె పెళ్లికి..
CoronaVirus: మరికొన్ని రోజుల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగనుంది. ఎన్నో ఆశలతో తన ఇంటి లక్ష్మిదేవిని మరో ఇంటికి పంపించేందుకు ఆ కుటుంబ పెద్ద ఏర్పాట్లు చేస్తున్నాడు.
CoronaVirus: మరికొన్ని రోజుల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగనుంది. ఎన్నో ఆశలతో తన ఇంటి లక్ష్మిదేవిని మరో ఇంటికి పంపించేందుకు ఆ కుటుంబ పెద్ద ఏర్పాట్లు చేస్తున్నాడు. తన కూతురికి ఏ లోటు రాకుండా అత్తగారింట్లో అడుగు పెట్టేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆ ఇంటి పెద్దను కరోనా కాటేసింది. రెండు రోజుల పాటు ఇంట్లోని ఉండి చికిత్స తీసుకున్నారు. కానీ, పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి చేరేలోపే కన్నుమూశాడు. ఈ ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు మహానగరం హైదరాబాద్‌లో జరిగింది.
ఉప్పల్‌లోని భరత్‌నగర్‌కు చెందిన ఈగ నర్సింగ్‌రావు చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మే 13న కుమార్తె వివాహం జరగనుంది. వివాహ ఏర్పాట్లలో ఉండగానే నర్సింగ్‌రావుకు కరోనా సోకింది. దాంతో రెండు రోజులకు ఆరోగ్యం పరిస్థితి విషమించి ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయాడు. మరోవైపు నర్సింగ్ రావు సతీమణి కూడా కరోనా బారిన పడటంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగారు.