Congress CM: కొత్త సీఎంను ప్రకటించనున్న ఖర్గే.. రాత్రి 8గంటలకు ప్రమాణస్వీకారం

Mallikarjun Kharge: రాత్రి 8గంటలకు తెలంగాణ కొత్త సీఎం ప్రమాణస్వీకారం

Update: 2023-12-04 09:28 GMT

Congress CM: కొత్త సీఎంను ప్రకటించనున్న ఖర్గే.. రాత్రి 8గంటలకు ప్రమాణస్వీకారం

Congress CM: రాజ్‌‌భవన్‌కు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహచార్యులు చేరుకున్నారు. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేశారు. అసెంబ్లీ రద్దు తీర్మానం గవర్నర్ కు చేరడంతో.. కాసేపట్లో కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మరో వైపు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారానికి ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజ్‌భవన్‌కు టెంట్లు, ఫర్నిచర్ తరలించారు. రాజ్‌భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కొత్త సీఎంను ఖర్గే ప్రకటించిన తర్వాత.. రాత్రి 8గంటలకు కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News