గర్భిణి ప్రసవ సమయంలో వైద్యులు ఏం చేసారో తెలుసా.?

Update: 2020-10-10 06:06 GMT

బిడ్డకు జన్మనివ్వటం అంటే తల్లి మరో జన్మ ఎత్తినట్టే అంటారు. ప్రసవ సమయంలో తల్లి పడే వేదన అంత ఇంత కాదు. కొన్ని సార్లు ప్రసవ సమయంలో తల్లులు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. ఇన్ని భయాలు ఉన్నా మరో బిడ్డకు జన్మనివ్వటానికి సిద్ధపడతారు. అంత బాధను భరించినా అప్పుడే పుట్టిన బిడ్డను చూని ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది. ఆ ఆనందంలో తన ప్రసవ నొప్పిని సైతం మరిచిపోతుంది. అయితే ప్రసవ సమయం ఆమె పడే వేదనను భర్త మాత్రమే తీర్చగలడు. ఎందుకంటే భర్తకు మించిన ధైర్యం భార్యకు మరొకటి ఉండదు. అందుకేనేమో ప్రసవ సమయంలో తన వెంట భర్త ఉంటడాలని కోరుకుంటుంది. తల్లీదండ్రులు, అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎంత మంది ఉన్నా తన భర్తకు సాటి రారు.

అయితే ఈ పద్దతి మనదేశంలో ఎక్కువగా అనుసరించనప్పటికీ పాశ్చాత్య దేశాలలో మాత్రం ఎక్కువగా అనుసరిస్తారు. ఇప్పుడు మన ఈ పద్దతిని తెలంగాణ రాష్ట్రంలోని మహాబుబాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అమలు చేసారు. ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళతో పాటు తన భర్తను కూడా అనుమతించారు. నిజానికిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చాలా కాలం క్రితమే గర్భిణీ స్త్రీ భర్త లేదా ఎవరైనా మహిళా బంధువులు ప్రసవించే గర్భిణి ప్రసవించే సమయంలో సహాయాన్ని అందించడానికి అనుమతించింది. అయితే ఇప్పటి వరకు ఈ పద్దతి ప్రాచుర్యం పొందలేదు.

అయితే తాజాగా నెల్లికుదురు మండలం చిన్నముప్పరం గ్రామానికి చెందిన మాధవి ప్రసవనొప్పులతో గురువారం మధ్యాహ్నం మహాబుబాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే అర్ధతాత్రి సమయంలో ఆమెకు నొప్పులు అధికం కావడంతో వైద్యులు ఆమెకు పురుడుపోయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే డెలివరీ సమయంలో తన భర్తను కూడా లేబర్ వార్డులోకి అనుమతించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ హాస్పిటల్ సిబ్బంది నాకు చాలా సహాయం చేసారని తెలిపింది. సాధారణ డెలివరీ చేసేందుకు వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ఎంతగానో ప్రయత్నించారన్నారు. తన భర్త టి సత్యనారాయణను ప్రసవ సమయంలో తనతో లోపలికి రానించారని తెలిపింది. అలా చేయడంతో తనకు ఎంతగానో ధైర్యం కలిగిందని మాధవి అన్నారు.

అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ భీమ్ సాగర్ మాట్లాడుతూ ప్రసవ సమయంలో భార్యతో భర్త ఉంటే ఆమెకు ఎంతో ధైర్యం ఉంటుందని తెలిపారు. ఇది ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీల మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని తెలిపారు. ఈ విధంగా మేము సాధారణ డెలివరీలను కూడా ప్రోత్సహించగలమన్నారు. ప్రసవ సమయంలో తన భార్యతో కలిసి రావాలని మేము సత్యనారాయణను కోరినప్పుడు, అతను వెంటనే అంగీకరించాడన్నారు. నిజానికి, శిశువు జన్మించిన తరువాత బొడ్డు తాడును కత్తిరించడానికి మేము అతన్ని అనుమతించామన్నారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డి భీమ్ సాగర్ తెలిపారు.

Tags:    

Similar News