Kakatiya Medical College: కాకతీయ మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ భూతం
Kakatiya Medical College: జూనియర్లను గ్రౌండ్‌లో మోకాళ్ల మీద కూర్చొబెట్టిన సీనియర్లు...
Kakatiya Medical College: ఉమ్మడి వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ భూతం కలకలం సృష్టించింది. తాము చెప్పిన మాట వినాలంటూ సీనియర్లు జూనియర్లను వేధిస్తున్నట్లు సమాచారం. జూనియర్లు తమకు అణిగిమణిగి ఉండాలని సీనియర్లు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. తమ ఆదేశాలను పాటించని విద్యార్థులను గ్రౌండ్‌లోకి తీసుకెళ్లి మోకాళ్ల మీద కూర్చొబెట్టి.. శిక్షలు విధిస్తారని తెలిసింది.
బాధితుల్లో ఓ విద్యార్థి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సమీప బంధువు కావడంతో సమస్య తీవ్రత పెరిగింది. ఆ విద్యార్థి తల్లిదండ్రులు హుటాహుటిన రాజస్థాన్ నుంచి హన్మకొండ చేరుకున్నారు. తమ కుమారుడిని ర్యాగింగ్ పేరుతో వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాకతీయ వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ను కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ర్యాగింగ్‌పై ఎలాంటి ఫిర్యాదులు అందలేదంటున్నారు కేఎంసీ ప్రిన్సిపల్.