TRS Bhavan: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్‌కు శంకుస్థాపన

TRS Bhavan: దేశ రాజధానిలో శాశ్వతంగా పార్టీ కార్యాలయం

Update: 2021-09-02 06:00 GMT
ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ కు సీఎం శంకుస్థాపన (ఫైల్ ఇమేజ్) 

TRS Bhavan: రెండు దశాబ్దాల ప్రస్థానంతో సాగుతున్న గులాబీ పార్టీ మరో మైలు రాయిని చేరడానికి సిద్ధం అవుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో హుస్సేన్ సాగర్ అలల ఒడిలో నాటి జలదృశ్యంలో మొదలై.. ఆ తర్వాత జన ప్రభంజనమై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాలకులను వణికించిన చరిత్ర టీఆర్ఎస్‌‌ది.. ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీలో మొదలైన కొట్లాట ఉధృతమై.. ఉప్పెనలా మారి వందలాది మంది త్యాగలాతో ఢిల్లీని తాకి విజయ తీరాలను చేరింది.. స్వరాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది కారు పార్టీ. అయితే.. ఏ దక్షిణాది ప్రాంతీయ పార్టీ చేయని ఆలోచన గులాబీ పార్టీ చేసింది. దేశ రాజధానిలో శాశ్వతంగా పార్టీ కార్యాలయం నిర్మించుకోబోతోంది. దాంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీలో శాశ్వత కార్యాలయమున్న వన్ అండ్ ఓన్టీ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ అవతరించబోతోంది..

గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేసిన సూదూర ముందు చూపుతో పనిచేస్తారు.. ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీల నేతలు ఎవరు చేయని విధంగా ఆయన ఆలోచనలు ఉంటాయి.. గతంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఎన్టీఆర్, చంద్రబాబు చేయని ఆలోచనను ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారు. ఢిల్లీలో ప్రాంతీయ పార్టీ భవనానికి శంకుస్థాపన చేస్తున్నారు. 2001లో హుస్సేన్ సాగర్ ఒడ్డున స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమయిన జలదృశ్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడ మొదలు పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం.. కొన్నాళ్ల పాటు సాగింది. ఆ తర్వాత అక్కడి నుంచి మరో చోటుకు మారింది. చివరకి 2006లో సొంత భవనాన్ని నిర్మించుకున్నారు.

ఎన్నో రాజకీయ సుడి గుండాలను దాటుకుని సుస్థిర పాలన సాగిస్తోంది. ఇక ఇప్పుడు ఢిల్లీ గడ్డమీద సగౌరవంగా సొంత పార్టీ కార్యాలయం నిర్మించుకుంటోంది. గులాబీ సువాసనలు రాజధాని నగరంలో గుబాళించేలా చేస్తోంది. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి రెడీ అవుతోంది. మరోవైపు.. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించడానికి ఈ కార్యాయలం వేదిక కాబోతుందా.. అన్న రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి.. గులాబీ పార్టీ వర్గాలు మాత్రం జాతీయ రాజకీయాల అంశంపై ఇప్పుడే ఏం చెప్పలేమన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

Full View


Tags:    

Similar News