Kuchadi Srihari Rao: బీఆర్ఎస్ పార్టీకి కుచాడి శ్రీహరి రావు రాజీనామా
Kuchadi Srihari Rao: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అవమానించడంతో పార్టీ వీడుతున్నట్లు వెల్లడి
Kuchadi Srihari Rao: నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కుచాడి శ్రీహరిరావు పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అవమానించడం వల్లనే పార్టీ వీడుతున్నట్లు వెల్లడించారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా... మండలాల్లో మంత్రి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు ఎవరికి కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తనకు నచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.