తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన దేశం కేసీఆర్ వైపు యువత కేటీఆర్ వైపు చూస్తోందన్నారు.
కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం కావడం సహజమేనన్నారు. వచ్చే ఏడాది కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది. మున్సిపల్ ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ తరువాత కేటీఆర్‌కే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.