KTR: అధికారం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చింది
KTR: అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎండగడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
KTR: అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎండగడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ తీరును శాసనసభ సమావేశాల్లో ప్రశ్నిస్తామన్న ఆయన, రైతాంగానికి ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాలపైనా పోరాడుతామన్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో నెలకొన్న సంక్షోభాలు, ఫార్మా విలేజ్‌ల పేరుతో పేద రైతుల భూములను గుంజుకుంటున్న తీరుపట్ల ప్రభుత్వ నిలదీస్తామన్నారు కేటీఆర్.