KTR: ఏం ఆశించి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు?
వికారాబాద్ జిల్లా దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
వికారాబాద్ జిల్లా దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రాడార్ స్టేషన్ ఏర్పాటును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఏం ఆశించి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఒకవైపు మూసీకి మరణశాసనం రాస్తూ మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టా అని ప్రశ్నించారు. VLF రాడార్ స్టేషన్ నిర్మాణంలో మూసీ అంతర్థానం అవుతుందన్నారు. పదేళ్లు ఒత్తిడి చేసినా రాడార్ స్టేషన్‌కు తాము ఒప్పుకోమని తెలిపారు. రాడార్ స్టేషన్‌కు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. దామగుండంలో రాడార్ స్టేషన్‌ను తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు.