కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ.. సీసీఐ యూనిట్ పున:ప్రారంభానికి...

KTR: సీసీఐ తెరిస్తే ఆదిలాబాద్ మరింత వేగంగా అభివృద్ది చెందుతుంది...

Update: 2022-01-02 08:38 GMT

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ.. సీసీఐ యూనిట్ పున:ప్రారంభానికి...

KTR: ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా యూనిట్‌ను తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్‌లోని CCI పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాలున్నాయని గుర్తుచేశారు. నిర్వహణకు అవసరమైన విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు, 170 ఎకరాల CCI టౌన్ షిప్, 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్.

2 KVA విద్యుత్‌ సరఫరా వ్యవస్థతో పాటు ఉత్పత్తికి సరిపడా నీటి లభ్యత కూడా ఈ సంస్థకు ఉందన్నారు. వెనుకబడిన మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్‌ జిల్లాల్లో CCI తిరిగి తెరిస్తే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. గిరిజనులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉండే ఈ ప్రాంతంలో సిసిఐ కంపెనీని తిరిగి ప్రారంభిస్తే అదిలాబాద్‌కు చెందిన స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

Tags:    

Similar News