హుస్సేన్‌సాగర్ వరదనీటి నాలాకు రక్షణ గోడ.. కేటీఆర్​ శంకుస్థాపన..

KTR: హైదరాబాద్‌లో చినికు పడిందంటే చాలు రోడ్లు చెరువులను తలపిస్తుంటాయి.

Update: 2021-12-30 12:14 GMT

హుస్సేన్‌సాగర్ వరదనీటి నాలాకు రక్షణ గోడ.. కేటీఆర్​ శంకుస్థాపన..

KTR: హైదరాబాద్‌లో చినికు పడిందంటే చాలు రోడ్లు చెరువులను తలపిస్తుంటాయి. రోడ్ల మీదకు వచ్చిన నీరు వివిధ నాలాల ద్వారా హుస్సేన్ సాగర్ లోకి చేరుకుంటుంది. చివరకు అది నిండి దాని కింద ప్రాంతాలను నీరు ముంచెత్తుతుంది. అలా ఇబ్బందులు పడకుండా హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌ద నీటి నాలాకు ర‌క్షణ గోడ‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఆ గోడ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌ చేశారు.

హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌ద నీటి నాలాకు సంబంధించిన‌ ర‌క్షణ గోడ నిర్మాణ ప‌నుల‌కు ఫీవ‌ర్ ఆస్పత్రి వ‌ద్ద మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. స్ట్రాట‌జిక్ నాలా డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా 68.4 కోట్ల వ్యయంతో ర‌క్షణ గోడ నిర్మించ‌నున్నారు. గ‌తేడాది వ‌ర్షాల‌కు నాలా ప‌రిస‌రాల్లో ప‌లు కాల‌నీలు జ‌ల‌మ‌యం అయ్యాయి. నాలాకు ర‌క్షణ గోడ నిర్మిస్తామ‌ని కాల‌నీ వాసుల‌కు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ర‌క్షణ గోడ నిర్మాణ ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. రక్షణ గోడను వ‌చ్చే జూన్ నాటికి పూర్తి చేయాల‌ని మంత్రి కేటీఆర్ అధికారుల‌ను ఆదేశించారు.

Tags:    

Similar News