KTR: వెస్ట్మారేడుపల్లిలో ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
KTR: సీఎం అల్పాహార పథకం ప్రారంభం
KTR: తెలంగాణలో సర్కారీ బడుల విద్యార్థుల కోసం.. సీఎం అల్పాహార పథకం ప్రారంభమైంది. వెస్ట్మరేడ్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 వేల 147 సర్కార్ బడుల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. తరగతుల ప్రారంభం కంటే అరగంట ముందు విద్యార్థులకు ఈ టిఫిన్ అందించనున్నట్టు తెలిపారు.