KTR: పేపర్ లీకేజీతో ప్రభుత్వానికి సంబంధం లేదు
KTR: TSPSCలో ప్రభుత్వ ప్రమేయం ఉండదు
KTR: TSPSC పేపర్ లీకేజీ ఘటనపై బండి సంజయ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. పేపర్ లీకేజీతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. TSPSC అనేది రాజ్యాంగ బద్ధమైన స్వయం ప్రతిపత్తి సంస్థ అన్నారు. అందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదన్నారు. అర్థం లేకుండా మంత్రిని బర్తరఫ్ చేయాలనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఒక ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పిదానికి మొత్తం వ్యవస్థను తప్పుబట్టడం సరికాదన్నారు.