KTR: ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరిక మేరకు సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు
KTR: మాస్టర్ ప్లాన్ కొత్త ప్రతిపాదన లేదు.. పాత ప్లాన్‌నే అమలు చేస్తాం
KTR: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి కామారెడ్డి ప్రజల సత్తా చూపించాలని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ మొత్తం కామారెడ్డి వైపు చూస్తుందన్నారు. ఉద్యమ ద్రోహి రేవంత్‌రెడ్డి కంటే షబ్బీర్ అలీ నయం అని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరిక మేరకు సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా కామారెడ్డి రూపురేఖలు మారుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ కొత్త ప్రతిపాదన లేదన్నారు. పాత ప్లాన్‌నే అమలు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.