KTR: కాంగ్రెస్ పరిపాలనలో విద్యుత్ రంగానిది దారుణ పరిస్థితి
KTR: 2014లో కాంగ్రెస్ అప్పగించిన వెళ్లిన శాఖల్లో.. విద్యుత్ శాఖ అత్యంత భయకరమైన శాఖ
KTR: కాంగ్రెస్ పరిపాలనలో విద్యుత్ రంగం కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మార్లు, మొత్తం లో వోల్టేజీ సమస్యలతో ఉండేదని విమర్శించారు ఎమ్మెల్యే కేటీఆర్. ఎప్పుడో అర్ధరాత్రి వచ్చే కరెంట్ కోసం బావుల దగ్గరపడుకునే పరిస్థితి ఉండేదన్నారు. ఊర్లలో ఎవరన్నా చనిపోతే కనీసం తలపై నీళ్లు చల్లుకునే పరిస్థితి లేదన్నారు.
2014లో కాంగ్రెస్ అప్పగించి వెళ్లిన అత్యంత భయంకరమైన శాఖల్లో విద్యుత్ శాఖ ఒకటని అన్నారు కేటీఆర్. తెలంగాణ ఏర్పడిన నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందన్నారు కేటీఆర్. 22 వేల 423 కోట్ల అప్పులను అప్పటి ప్రభుత్వం అప్పజెప్పి వెళ్లిందన్నారు. ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులే చూపెట్టడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వంపై రివర్స్ ఎటాక్ చేశారు కేటీఆర్.