MLC Kavitha: కవిత అరెస్ట్.. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం..
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అమెను అదుపులోకి తీసుకున్నారు. మద్యం కేసులో హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఈడీ.. సోదాల అనంతరం అరెస్టు నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో కవిత ఇంటికి కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు.
ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని వాదించారు. సుప్రీంకోర్టులో అండర్‌టేకింగ్ ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించిన కేటీఆర్.. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉండగా ఈడీ చర్యలు సరికాదన్నారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అధికారులు కేటీఆర్ ను సముదాయించే ప్రయత్నం చేశారు.