Komuravelle Jatara: భక్తజనసంద్రాన్ని తలపించిన కొమురవెల్లి మల్లన్నక్షేత్రం

Komuravelle Jatara: మూడు నెలలుపాటు సాగిన మల్లన్న జాతర

Update: 2022-03-27 13:45 GMT

భక్తజనసంద్రాన్ని తలపించిన కొమురవెల్లి మల్లన్నక్షేత్రం

Komuravelle Jatara: డప్పుల చప్పుళ్లు శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలతో మల్లన్న ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రాన్ని తలపించింది. సిద్ధిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కొములవెల్లి మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. ఉత్సవాల ఆఖరి రోజున భక్తులు అనూహ్యంగా పెరిగిపోయారు. 500 రూపాయల టిక్కెట్టుతో మల్లన్న ప్రత్యేక దర్శనానికి ఐదారుగంటల సమయం పట్టింది.

కొండ చరిల్లో వెలసిన కోరమీసాల కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రతియేటా సంక్రాంతి తర్వాత మూడునెలలపాటు సాగే మల్లన్న జాతర ప్రత్యేకతను సంతరించుకుంది. భక్తులు స్వామి వారికి పట్నాలు వేసి, బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. కొమురవెల్లి ఉత్సవాల్లో ఆఖరి ఆదివారం నిర్వహించే అగ్నిగుండంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. వీరశైవ సాంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు 5రకాల సమిధలను పేర్చి అర్థరాత్రి 12గంటల తర్వాత అగ్ని ప్రజ్వలన చేస్తారు. వీరశైవ అర్చకులు విశేషపూజలతో స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో అగ్ని ప్రవేశం చేయడంతో అగ్ని గుండాల ఘట్టం వైభవాన్ని సంతరించుకుంటుంది. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఈ ఘట్టంలో భక్తులు ఆపదమొక్కులను తీర్చుకుంటారు.

Tags:    

Similar News