Komatireddy: కరెంట్ కోతలపై మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy: సీఎం కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి విమర్శలు
Komatireddy Venkat Reddy: ప్రభుత్వం అందిస్తోన్న రైతుబంధు నగదు.. వడ్డీ కట్టడానికి కూడా సరిపోవడంలేదన్నారు నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. మరోవైపు కరెంట్ కోతల అంశంలో ప్రభుత్వంపై కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. 24 గంటల కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలంటోన్న కేసీఆర్, రాష్ట్రంలో ఎక్కడా కూడా రైతులకు 12, 13 గంటల కరెంట్ ఇవ్వడంలేదన్నారు. కరెంట్ కోతలపై తనకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు కోమటిరెడ్డి. నల్గొండ జిల్లా అప్పాజీపేటలో కనీసం ఆరు గంటల కరెంట్ కూడా రావడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం మాటలను రైతులు నాట్లు వేసుకుంటే, విద్యుత్ సరఫరాలో కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. రైతులు నష్టపోకుండా చూడాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.