Komatireddy Raj Gopal Reddy: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా

Komatireddy Raj Gopal Reddy: ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ పోస్ట్‌ ఇచ్చిన బీజేపీ

Update: 2023-10-25 06:26 GMT

Komatireddy Raj Gopal Reddy: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. నల్గొండలో కమలం పార్టీకి షాక్‌ తగిలింది. బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేశారు. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ఆయన ప్రకటన విడుదల చేశారు. గతేడాది ఇదే సమయంలో కాంగ్రెస్‌ను వీడి.. మునుగోడు సభలో అమిత్‌ షా సమక్షంలో కమలం గూటికి వెళ్లారు రాజగోపాల్‌రెడ్డి. ఆ తర్వాత మునుగోడు బైపోల్‌లో రాజగోపాల్‌ ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాజగోపాల్.. బీజేపీపై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో మరింత అసహనానికి గురయ్యారు. దీంతో.. తిరిగి సొంతగూటికి రాజగోపాల్‌రెడ్డి చేరాలని నిర్ణయించుకున్నారు. ఎల్లుండి సూర్యాపేటలో అమిత్‌ షా సభ జరగనుంది. అదేరోజు కాంగ్రెస్‌లో రాజగోపాల్‌ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి రాజగోపాల్‌రెడ్డి..? దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News