కోదండరాం పోటీపై టీజేఎస్‌ క్లారిటీ

Update: 2020-10-07 05:46 GMT

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ప్రొఫెసర్ కోదండరాం పోటీపై ఉత్కంఠ వీడింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం అభ్యర్థిగా ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేస్తున్నారని తెలంగాణ జనసమితి వెల్లడించింది. ఈ మేరకు పార్టీ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు వెల్లడించారు. అందరూ ఊహించిన విధంగానే ప్రొఫెసర్ కోదండరామ్ పేరును రాష్ట్ర కార్యవర్గం ప్రకటించింది.

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు ప్రొఫెసర్ కోదండరాం సిద్ధమయ్యారు. తెలంగాణలో నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని అది తమకు కలిసి వస్తుందని తెలంగాణ జన సమితి భావిస్తుంది. అందుకోసం ప్రణాళికాబద్ధంగా ఇప్పటికే వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల్లో పలు సమస్యలపై ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో పర్యటించారు. నిరుద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నందున ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం వెనుకడుగు వేయడంతో శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకగా ప్రొఫెసర్ కోదండరామ్ నిలుస్తారని అందుకే పార్టీ రాష్ట్ర కార్యవర్గం కోదండరాం ను అభ్యర్థిగా ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలు ప్రజా సమస్యలపై పై అన్ని పార్టీలతో కలిసి ఉమ్మడిగా పోరాడిన తెలంగాణ జన సమితి గత ఎన్నికల్లో మహాకూటమిగా పోటీ చేసినప్పుడు జనగామ లో ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేస్తారని అనుకున్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంతో ఆ సీటును కోదండరాం వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా కోదండరాంకి మద్దతు విషయమై ఆలోచనలో పడింది. వామపక్షాల పరిస్థితి కూడా అలాగే ఉంది.

అధికార పార్టీ తప్పిదాలను ప్రశ్నించటానికే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానాని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. పట్టభద్రుడు ఎన్నికల కోసం ఇతర పార్టీల మద్దతు కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి నిరుద్యోగులను కలుస్తామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కోదండరామ్‌కి మద్దతుగా ఉన్న పార్టీలు పట్టభద్రులు ఎన్నికల్లో మద్దతు ఇస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

Full View


Tags:    

Similar News