Prajapalana: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. 6 గ్యారెంటీలకు దరఖాస్తు చేశారా.. స్టేటస్ చెక్ చేసుకోండిలా..!

Prajapalana: ప్రజా పాలనలో సమర్పించిన దరఖాస్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్‌ను రూపొందించింది.

Update: 2024-01-10 09:22 GMT

Prajapalana: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. 6 గ్యారెంటీలకు దరఖాస్తు చేశారా.. స్టేటస్ చెక్ చేసుకోండిలా..!

Prajapalana 6 guarantees: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తోంది. అలాగే, 'అభయహస్తం' పేరుతో ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈమేరకు అర్హులను ఎంపిక చేసేందుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రలోని ప్రతి గ్రామం, పట్టణాల్లో అమలు చేసింది. జనవరి 6వ తేదీ వరకు చివరి తేదీగా నిర్ణయించి, ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే, ఈ పథకానికి మీరు దరఖాస్తు చేశారా.. అయితే, మీకో గుడ్ న్యూస్ తీసుకొచ్చాం. ఈ కొత్త అప్ డేట్ అందరికి ఎంతో ఉపయోగపడనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రజా పాలనలో సమర్పించిన దరఖాస్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్‌ను రూపొందించింది. ప్రజా పాలనలో అందించిన దరఖాస్తుల ప్రక్రియను ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రజాపాలనలో అధికారులు అందించిన రసీదులోని దరఖాస్తు నెంబర్‌ను ఈ వెబ్ సైట్‌లో ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

అందుకోసం https://prajapalana.telangana.gov.in/Applicationstatus లింక్ ఓపెన్ చేయాలి. అలాగే అక్కడ కనిపించే నౌ యువర్ అప్లికేషన్ స్టేటస్‌లో కనిపించిన బాక్స్‌లో దరఖాస్తు లేదా రసీదు నంబర్‌ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వ్యూ స్టేటస్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ దరఖాస్తు ఓకే అయిందా లేదా రిజక్ట్ చేశారా అనే విషయం తెలుస్తుంది.

కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఇచ్చిన 6 హామీలలో భాగంగా.. ఇప్పటికే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరో 5 పథకాల కోసం ప్రజాపాలనలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, అర్హులకు ఈ పథకాన్ని అందించేందుకు శ్రమిస్తోంది. కాగా, ఇందుకోసం ప్రభుత్వం 100 రోజులు గడువు విధించుకుంది. ఈ 6 గ్యారంటీల తప్పకుండా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రజాపాలన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News