హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్‌పై కేంద్రానికి కిషన్‌రెడ్డి లేఖ
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్‌పై కేంద్రానికి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్‌ను జాతీయ రహదారిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్‌పై కేంద్రానికి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్‌ను జాతీయ రహదారిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి ఇప్పటికే కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇఛ్చింది. NH-65, NH-161లను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్‌కు ప్రతిపాదించారు. హైదరాబాద్‌తోపాటు 5 జిల్లాలను కలుపుతూ నిర్మించనున్న ఈ రీజనల్ రింగ్ రోడ్ 334 కిలోమీటర్లగా ఉంది. అయితే, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్‌ను జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్రానికి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్‌తో హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడమే కాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్‌పూర్-భువనగిరి-చౌటుప్పల్‌ను కలుపుతూ NH-161 నిర్మాణం అలాగే, చౌటుప్పల్-షాద్‌నగర్-సంగారెడ్డిని కలుపుతూ NH-65 నిర్మాణం చేపట్టనున్నారు. అయితే, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ బీజేపీ నేతలు దీన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. 17వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్‌ను నిర్మించనున్నారు.