ఓట్ల కోసమే విపక్షాలపై సీఎం కేసీఆర్ బురద జల్లుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. శాంతిభద్రతల సమస్య అంటూ అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. అధికారం, పదవులు ఎవరికీ శాశ్వతం కాదన్నది గుర్తుంచుకోవాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమో సీఎం చెప్పాలన్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గించాలని కుట్ర చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూలుస్తామంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. ఎంఐఎం వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.