Kidney Patient Recovers From Corona: నెగెటివ్ రిపోర్ట్ వచ్చినా తీరని డయాలసిస్ బాధలు
Kidney Patient Recovers From Corona: దీర్ఘకాలిక వ్యాధులున్న కొంత మంది వ్యక్తులు కరోనాను జయించినప్పటికీ ఆ తరువాత వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Kidney Patient Recovers From Corona: దీర్ఘకాలిక వ్యాధులున్న కొంత మంది వ్యక్తులు కరోనాను జయించినప్పటికీ ఆ తరువాత వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో ఏడేళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డాడు. అయితే ఆ వ్యక్తి ఆత్మస్థైర్యంతో, గుండె నిబ్బరం చేసుకుని గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కరోనాను జయించాడు. కానీ మళ్లీ డయాలిసిస్ చేయించుకోవడానికి వెళ్తే అసలు కష్టలు మొదలయ్యాయి.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్‌కు చెందిన కొమ్మరాబు బాలరాజు తన కుల వృత్తిని కొనసాగిస్తూ, మరో వైపు బ్యాండ్ మేళంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అతను గత ఏడేండ్ల నుంచి కిడ్నీ సంబంధిత వ్వాధితో బాధపడుతున్నాడు. ఆరేళ్ల నుంచి ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో డయాలసిసి్ చేయించుకుంటున్నాడు.
ఇదే క్రమంలో బాలరాజు కొద్ది రోజులక క్రితం డయాలిసిస్ చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లాడు. అతను వెళ్లిన రోజున అదే హాస్పిటల్‌కు చెందిన ఓ కిడ్నీ పేషెంట్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది కరోనా కేసు నిర్ధారణ అయిన రోజు ఎవరైతే డయాలసిస్‌కు వచ్చారో వారి విరాలు తీసుకుని ఫోన్ చేసారు. ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆస్పత్రి వర్గాలు సూచించారు. ఆ జాబితాలో బాల్‌రాజు కూడా ఉండడం. దీంతో బాల్ రాజు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో గత నెల 27న కోవిడ్ 19 పరీక్ష చేయించుకున్నాడు. కాగా అతనికి 29న పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. వెంటనే బాల్‌రాజు కుమారుడు 108కు సమాచారం ఇచ్చాడు. బాల్‌రాజును అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ హాస్పిటల్‌లో చేరిన బాలరాజు 16 రోజుల చికిత్స అనంతరం కోలుకొని ఇంటికొచ్చాడు.
అయితే మొదటి నుంచే బాలరాజు మూడు రోజులకోసారి డయాలసిస్ చేయించుకోవాలి్సన ఉండగా తాను ఎప్పుడూ పరీక్ష చేయించుకుంటున్న ఆస్పత్రికి వెళ్లారు. కాగా అక్కడి వైద్యులు ప్రస్తుతం తనకు డయాలసిస్ పరీక్షలు చేయబోమని, వేరేచోట చేయించుకోవాలని పంపించారు. దీంతో అతను మరో రెండు మూడు ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేదు. ఆ తరువాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆలేరు లోని ప్రభుత్వ భగవాన్ మహావీర్ జనరల్ లైఫ్ ఫాండేషన్ సెంటర్‌లో డయాలసిస్ పరీక్ష కోసం వెళ్లాడు. అక్కడి వైద్యులు కరోనా నుంచి కోలుకున్న తరువాత మళ్లీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆ తరువాతే వైద్యం అందిస్తామని చెప్పారు. కాబట్టి క్వారంటైన్ గడువు ముగిశాక రావాలని సూచించారు. ఇక మూడు రోజులకోసారి డయాలసిస్ చేయించుకోకపోతే తనకు ఆరోగ్య సమస్యలు వెంటాడతాయని, ఎక్కడ వైద్యం చేయించుకోవాలని బాలరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.