వరుడు క్రిస్టియన్, వధువు ముస్లిం..వివాహం హిందూ సంప్రదాయంలో

Khammam Interfaith Wedding : సాధారణంగా పెళ్లిలు అంటే ఏ మతానికి చెందిన వారిని ఆ మతానికి చెందిన వారు, ఏ కులానికి చెందిన వారిని ఆ కులానికి చెందిన వారు చేసుకుంటారు.

Update: 2020-08-10 07:16 GMT
ప్రతీకాత్మక చిత్రం

Khammam Interfaith Wedding : సాధారణంగా పెళ్లిలు అంటే ఏ మతానికి చెందిన వారిని ఆ మతానికి చెందిన వారు, ఏ కులానికి చెందిన వారిని ఆ కులానికి చెందిన వారు చేసుకుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో ప్రేమ వివాహాలు జరుగుతుండడంతో ఒక మతం వారు మరో మతం వారిని, ఒక కులానికి చెందిన వారు మరో కులం వారిని వివాహాలు చేసుకుంటున్నారు. అయితే రెండు మతాలకు చెందిన వారు పెళ్లిలు చేసుకున్నప్పుడు ఏదో ఒక మతానికి చెందిన సాంప్రదాయ పద్దతిలో చేసుకుంటారు. కానీ రెండు వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకొని తమ ఆచారాలకు భిన్నంగా మరో మతాచారం ప్రకారం పెళ్లి చేసుకోవడం మాత్రం విశేషమే కదా. ఇలాంటి ఘటన ఖమ్మం జిల్లా తల్లాడలో చోటు చేసుకుంది.

అయితే ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన కోపిల అనిల్ కుమార్ ఖమ్మంలో ఇంటర్ చదివాడు. తాను ఇంటర్ చదువుతున్న సమయంలోనే షేక్ సోనీ అనే ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తరువాత ఆ స్నేహం కాస్త పెరిగి ప్రేమగా మారింది. అయితే అనిల్ కుమార్ ఇంటర్ పూర్తి చేసుకున్న తరువాత బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్నాడు. ఎలాగయినా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సోనీని పెళ్లాడాలని నిర్ణయించుకున్నారు. అయితే అన్ని ప్రేమ జంటలకు వచ్చినట్టు గానే ఇక్కడ కులం కాదు మతం అడ్డుపడింది. అనిల్ క్రిస్టియన్, సోని ముస్లిం కావడంతో షేక్ సోనీ కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా ఏదో ఒక విధంగా అనిల్ సోని కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించాడు. అయితే అనిల్ క్రిస్టియన్ కాబట్టి వీరిద్దరూ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలి, లేదా సోని ముస్లి కాబట్టి ఇస్లాం ఆచారాల ప్రకారం నిఖా చేసుకోవాలి. కానీ వీరు ఇద్దరూ అలా చేయకుండా అందరికీ ఆదర్శంగా నిలిచేందుకు రెండు మతాలకు భిన్నంగా ఉండేట్లు హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం ఉదయం 9.49 గంటలకు వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. వరుని కుటుంబ సభ్యుల సహకారంతో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంటను పలువురు అభినందిస్తున్నారు.

 


 

Tags:    

Similar News