ఒకప్పుడు గుట్టలు..ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్ట్ మెంట్లు

Update: 2020-09-19 07:07 GMT

ఖాజాగూడ.. ఈ పేరు భాగ్యనగర వాసులకు పెద్దగా పరిచయం లేని పేరు ఒకప్పుడు పల్లెటూరు వాతావరణం. అభివృద్ధికి దూరంగా గుట్టలు, పుట్టలతో నిండిన ఈ ఏరియా ఇప్పుడు పెద్దపెద్ద భవన నిర్మాణాలకు నిలయంగా మారింది. ఇక తెలంగాణ ప్రభుత్వం చెరువుల సుందరీకరణపై దృష్టిపెట్టడంతో ఖాజాగూడ చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకప్పుడు బతుకమ్మను చెరువులో విడిచే రోజు మాత్రమే గుర్తుకు వచ్చే ఈ ప్రాంతం ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్ ను తలపిస్తోంది.

హైటెక్ సిటీకి పది కిలో మీటర్ల దూరంలో ఉండే ప్రాంతం ఖాజాగూడ అభివృద్ధికి దూరంగా గుట్టలు, పుట్టలతో నిండిన ఈ ఏరియా ఇప్పుడు పర్యాటక శోభను సంతరించుకుంది. లింకు రోడ్డు పుణ్యమా ఖాజాగూడ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ గా మారింది. కేవలం బతుకమ్మ పండుగ సమయంలో ఖాజాగూడా వాసులు మాత్రమే ఇక్కడి చెరువు దగ్గరకు వెళ్లే వారు. అలాంటిటిది చెరువుల సుందరీకరణపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టడంతో ఖాజాగూడ చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించేలా భవిష్యత్తు వాహనాల రద్దీని దృష్టిలోపెట్టుకుని ఎలివేటెడ్ కారిడార్ కు రూపకల్పన చేసింది ప్రభుత్వం. రాష్ర్ట ఐటీ మంత్రి కేటీఆర్ ఆదేశంతో ఖాజాగూడ చెరువును మినీ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా రోడ్డు విస్తరణ, చెరువు వైపు భారీ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. చెరువులో రెండు ఫౌంటెయన్లు ఏర్పాటు చేసి ట్రయల్ రన్ చేపట్టారు. ఇక చెరువులో ఫ్లోటింగ్ ప్లాంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటికితోడు చెరువుగట్టుపై ముద్రలో ఉన్న భారీ శిల్పాన్ని ఏర్పాటు చేయడంతో చెరువుకే కొత్త అందం వచ్చింది. నగరవాసులు చెరువు గట్టుకు చేరుకుని సెల్పీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

గతంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతుండటంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్, పర్యావరణ పరంగా అనుకూలంగా ఉండటంతో ఖాజాగూడ చెరువు ఆకట్టుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ చెరువు వీకెండ్ స్పాట్ గా మారుతుందనడంలో సందేహంలేదు. నిర్మించుకునేవారికి ఖాజాగూడ చక్కని వేదిక అవుతుందనీ రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

Full View


Tags:    

Similar News