కొలువు తీరిన ఖైరతాబాద్ గణేష్..

Update: 2020-08-22 04:58 GMT

Khairatabad Ganesh: వినాయక చవితి వచ్చిందంటే చాలు అందరి దృష్టి ఖైరతాబాద్ గణేశుడిపైనే ఉంటుంది. ఏ అవతారంలో ఎంత ఎత్తులో దర్శనమిస్తాడో అని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రాష్ట్రంలో ఏ గణపయ్యకు లేని ప్రత్యేకత ఖైరతాబాద్ గణేశుడికి ఉంది. అలాంటి విఘ్నేశ్వరుడికి ఈసారి కరోనా ఎఫెక్ట్ తగిలింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ దఫా విగ్రహం నిర్మాణాన్ని 9 అడుగులకే పరిమితం చేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్‌లోని గణపయ్య ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనిమస్తున్నారు.

ఈసారి వినాయకుడు ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో కనిపిస్తున్నారు. వ్యాక్సిన్ తొందరగా రావాలని ధన్వంతరి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. వినాయకుడి విగ్రహం రూపొందించడానికి గుజరాత్ నుంచి మట్టిని తెప్పించారు. ఎత్తు తక్కువగా ఉండటంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయట్లేదని వివరించారు. విగ్రహం ఉన్న చోటే ద్రవాలతో అభిషేకం నిర్వహించి నిమజ్జనం చేస్తామని చెప్పారు. కరోనా దృష్ట్యా భక్తులకు నేరుగా అనుమతి లేదని www.ganapathideva.org వెబ్‌సైట్‌ ద్వారా పూజా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.



Tags:    

Similar News