ఖైరతాబాద్‌లో ఈసారి మట్టి గణనాథుడు.. ఎత్తు ఎంతో తెలుసా?

Khairatabad Ganesh 2022: హైదరాబాద్ భారీ వినాయకుడిగా పేరొందిన ఖైరతాబాద్ లో ఈ ఏడాది మట్టిగణపతి పూజలందుకునేందుకు సిద్దమయ్యారు.

Update: 2022-06-10 15:00 GMT

ఖైరతాబాద్‌లో ఈసారి మట్టి గణనాథుడు.. ఎత్తు ఎంతో తెలుసా?

Khairatabad Ganesh 2022: హైదరాబాద్ భారీ వినాయకుడిగా పేరొందిన ఖైరతాబాద్ లో ఈ ఏడాది మట్టిగణపతి పూజలందుకునేందుకు సిద్దమయ్యారు. 1954లో ప్రారంభమైన బడా గణేశ్‌ ప్రస్థానం 68 సంవత్సరాలుగా నిరాటకంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు పీవోపీ ద్వారా వైవిధ్యభరితమైన రూపాల్లో గణపతిని ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్‌ గణేశుడి చరిత్రలోనే మొదటిసారిగా మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన పద్ధతులతో రూపొందిస్తే విగ్రహం పింగాణిలా మారుతుందని శిల్పి రాజేంద్రన్‌ వెల్లడించారు. మట్టి విగ్రహాలనే వాడాలని గత ఏడాది ఉత్సవాల సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఉత్సవ కమిటీ గుర్తు చేసింది. మట్టి విగ్రహం ఎత్తు 50 అడుగుల మేర ఉంటుందని వెల్లడించింది.

Tags:    

Similar News