Ganesh Nimajjanam: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి
Ganesh Nimajjanam: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి
Ganesh Nimajjanam: ఖైరతాబాద్ గణనాధుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ శోభయాత్ర మధ్యాహ్నం ఒంటిగంటా 30 నిమిషాల వరకు సాగింది. క్రేన్ నెంబర్ 4 వద్ద దాదాపు గంట పాటు పూజలు నిర్వహించారు. పూజల క్రతువు పూర్తయిన తర్వాత బడా గణేశ్ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. భారీ భద్రత మధ్య బడా గణేశ్ శోభాయాత్రను నిర్వహించారు పోలీసులు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు ట్యాంక్ బండ్‌కు భారీగా జనం తరలివచ్చారు. భారీ జనసందోహంతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.